
ముష్కి చెరువు పరిరక్షణకు ఉద్యమిస్తాం
మణికొండ: నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల మధ్యలో ఉన్న ముష్కి చెరువును పరిరక్షణకు అవసరం అయితే ఉద్యమిస్తామని మైహోం అవతార్, హాల్‌మార్క్ వినిసియా నివాసితులు పేర్కొన్నారు. సోమవారం చెరువు వద్ద వారు సమావేశమయ్యారు. చెరువు వద్ద నిబంధనలకు విరుద్ధగా దృవాన్ష్ సంస్థ చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమ అభ్యంతరాలను ఇప్పటికే హైడ్రా, హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. తమ చర్యలను ఆయా శాఖల అధికారులు సైతం అభినందించి దిద్దుబాటు చర్యలు చేపడతామని, హెచ్‌ఎండీఏతో తత్వా రియల్ ఎస్టేట్ సంస్థకు జరిగిన ఒప్పందాల ప్రకారమే పనులను చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. వాటిని నిలుపుకొనేందుకు మరో వారం రోజుల పాటు సమయం ఇస్తామని, అయినా నిబంధనలకు విరుద్ధంగా పనులను చేపడితే ప్రజా ఆందోళనను చేపడతామన్నారు. కార్యక్రమంలో నివాసితుల సంఘం ప్రతినిధి గౌతంరెడ్డి, నివాసితులు పాల్గొన్నారు.