
ఆలూరు మార్గం.. ఆగమాగం
చేవెళ్ల: ఆలూరు గేట్ నుంచి తంగడపల్లి రోడ్డు మీద ప్రయాణం కత్తి మీద సాములా మారింది. ఈ రోడ్డు అభివృద్ధిని పట్టించుకునే వారు లేక ప్రయాణికులు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. రోడ్డంతా గుంతలమయంగా మారడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు రోడ్డు పక్కన పోసిన మట్టి వర్షానికి బురదగా మారి వాహనాలు దిగబడిపోతున్నాయి.
ప్రకటనలకే పరిమితం
హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ఉన్న ఆలూరు గేట్ నుంచి తంగడపల్లి హైవే వరకు 12 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ రోడ్డు మీదుగా ఆలూరు, వెంకన్నగూడ, దుద్దాగు, తలారం, తంగడపల్లి, మడికట్టు, హుసేన్‌పూర్, కొత్తపల్లి, చందిప్ప, ఎన్కేపల్లి, శంకర్‌పల్లి మండలానికి వెళ్లే గ్రామాలు ఉన్నాయి. నిత్యం ఈ మార్గంలో వందల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రెండు హైవేలను కలిపే ఈ లింక్ రోడ్డు ఆర్‌అండ్‌బీ పరిధిలోకి వస్తుంది. దీని అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనట్లు చెబుతున్నా ఇప్పటి వరకు పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటికై నా అధికారులు, నాయకులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
స్థానిక ఎన్నికలను బహిష్కరిద్దాం: శ్రీకాంత్
సోమవారం ఈ మార్గాన్ని పీడీఎస్‌యూ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు కుమార్, మహేందర్, అశోక్, పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ రోడ్డు ఇంత అధ్వానంగా మారినా స్థానిక ఎమ్మెల్యేకు, అధికారులకు కనిపించకపోవడం శోచనీయం. ఈ రోడ్లను చూస్తుంటే నియోజకవర్గానికిఎమ్మెల్యే ఉన్నాడా అనే అనుమానం కలుగుతోందన్నారు. నిత్యం ప్రమాదాల జరుగుతున్నా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పటికై నా ఆర్‌అండ్‌బీ అధికారులు మొద్దు నిద్ర వీడాలన్నారు. ఈ మార్గాన్ని త్వరితగతిన బాగు చేయకపోతే స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
గుంతలమయంగా మారడంతోఇబ్బంది పడుతున్న వాహనదారులు
పట్టించుకునే వారే కరువయ్యారని ప్రజల ఆగ్రహం
రోడ్ల దుస్థితిని పరిశీలించిన పీడీఎస్‌యూ నాయకులు

ఆలూరు మార్గం.. ఆగమాగం