
ఉద్యాన పంటలపై ఆసక్తి చూపాలి
బొంరాస్‌పేట: కూరగాయలు, పండ్ల పంటలపై రైతులు ఆసక్తి చూపాలని ఉద్యానశాఖ ఉపసంచాలకులు నీరజ అన్నారు. 2025–26 ఆయిల్ పామ్ విస్తరణలో భాగంగా గురువారం మండల పరిధిలోని చౌదర్‌పల్లిలోని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి 4.5 ఎకరాల పొలంలో మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమం ప్రారంభించారు. ఆయిల్‌పామ్ సాగులో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు, సాగు విధానం, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయిల్‌పామ్ సాగు విస్తరించాలని అన్నారు. కార్యక్రమంలో డీహెచ్‌ఎస్‌ఓ సత్తార్, అధికారులు సంజయ్‌సోనీ, స్టేట్ కోఆర్డినేటర్ సురేశ్, సురేంద్రనాథ్, కమల, అక్షితరెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఉప సంచాలకులు నీరజ