
కృష్ణా జలాలు పరిగికి తెస్తాం
పరిగి: కృష్ణా జలాలను పరిగి నియోజకవర్గానికి తెచ్చి ఈ ప్రాంత భూములను శస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం పరిగి పట్టణంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం త్వరలో జీవో విడుదలు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమన్నారు. అన్ని హంగులతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి విద్య అందిచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎంతో తాపాత్రయ పడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. కష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదన్నారు. కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, డీఈఓ రేణుకాదేవి, డీటీడీఓ కమలాకర్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
మహిళలను కోటీశ్వరులను చేస్తాం
దోమ: రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చే యడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, మహిళా సంఘాల సభ్యులకు రుణ చెక్కు లను ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభు త్వం పదేళ్లల్లో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక అర్హులందరికీ కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పరిగి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. త్వరలో భూమిలేని ప్రతి రైతుకూ రూ.12 వేలు ఇస్తామని పేర్కొన్నారు. దోమ మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు త్వరలో శంకుస్థాపనలు చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో కృష్ణా జలాలను పరిగి నియోకవర్గానికి తెచ్చి ఇక్కడి భూములను శస్యశ్యామలం చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడారు. గత ప్రభత్వం రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా మోసం చేసిందని ఆరోపించారు. అనంతరం మోత్కూర్ లోని చెంచుకాలనీలో రూ.60లక్షల వ్యయంతో మల్టీపర్పస్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశా రు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్‌డీఓ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు మాలి విజయ్ కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
అన్ని హంగులతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం
ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు