
రైలు నుంచి జారిపడి..
నందిగామ: రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని హెచ్‌బీఎల్ పరిశ్రమ సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే కానిస్టేబుల్ మల్లేశ్ తెలిపిన ప్రకారం.. హెచ్‌బీఎల్ పరిశ్రమ సమీపంలో ఆదివారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని రైలు నుంచి కిందపడి గుర్తుతెలియని వ్యక్తి(35) రైలు పట్టాలపై మృతి చెంది ఉన్నాడు. సోమవారం ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించామన్నారు. మృతుడి ఎడమ చేతిపైన ఆంటోనియా అని పచ్చబొట్టు ఉందని, కుడిచేతికి బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండేజీ ఉందని చెప్పారు. మృతుడికి ఉంగరాల జుట్టు ఉందని, బూడిద రంగు ప్యాంటు, బ్లాక్ డ్రాయర్ ధరించి ఉన్నాడని, మృతుడి ఒడిశా లేదా బీహార్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేశారు. తిమ్మాపూర్ స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టు మార్ట నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. వివరాలకు 98480 90426 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం