
క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం
తాండూరు రూరల్: జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు తాండూరులో నిర్వహిస్తామని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని జినుగుర్తిలో వాలీబాల్ క్రీడాకారుడు పి.శ్రీనివాస్ జ్ఞాపకార్థం టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. వాలీబాల్ అంటే గుర్తుకు వచ్చేది జినుగుర్తి గ్రామమని గుర్తు చేశారు. హెల్మెట్ పెట్టుకోక తన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని శ్రీనివాస్ తండ్రి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన కొడుకు జ్ఞాపకార్థంగా 100 హెల్మెట్లను పంపిణీ చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రాములు, పురుషోత్తంరావు, సంపత్‌కుమార్, రమేశ్‌కుమార్ ఉత్తమ్‌చందు, రాంలింగారెడ్డి, ఆంజనేయులు, సాయిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.