
17న లయన్స్ క్లబ్ ఇన్‌స్టాలేషన్
క్లబ్ అధ్యక్షుడు మురహరి వశిష్ట
కొడంగల్: కొడంగల్ పట్టణ లయన్స్ క్లబ్ ఇన్‌స్టాలేషన్‌ను ఈ నెల 17న(గురువారం) సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ క్లబ్ అధ్యక్షుడు మురహరి వశిష్ట తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇన్‌స్టాలేషన్ ఆఫీసర్‌గా లయన్ నటరాజ్, ముఖ్య అతిథులుగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, జిల్లా సెకండ్ వైస్ గవర్నర్ లయన్ శశికాంత్, ఇండక్షన్ అధికారిగా లయన్ మృత్యుంజయ, ఇన్‌స్టాలేషన్ కమిటీ చైర్మన్‌గా ముద్దప్ప దేశ్‌ముఖ్ వ్యవహరిస్తారని చెప్పారు. క్లబ్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వేలాది మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించినట్లు తెలిపారు.
మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్
దోమ: అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్న వాహనాలను టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం రాత్రి పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ అన్వర్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామ సమీపంలో కొందరు టిప్పర్లలో మట్టిని నింపి యఽథేచ్ఛగా తరలిస్తున్నారని సమాచారం అందిందన్నారు. ఈ మేరకు సిబ్బందితో కలిసి అక్కడి చేరుకొని ఐదు టిప్పర్లు, ఓ జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను స్థానిక పోలీసులు సీజ్ చేసి ఏడుగురిపై కేసు నమోదు చేశారు. అక్రమ మట్టి వ్యాపారం చేస్తే ఉపేక్షించేది లేదని టాస్క్‌ఫోర్స్ సీఐ హెచ్చరించారు.
ఆర్‌ఐగా అదనపు బాధ్యతలు
ధారూరు: మండల ఆర్‌ఐగా దేవెందర్‌రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్‌ఐ స్వప్న పర్యవేక్షిస్తున్న ధారూరు, నాగారం, అంపల్లి, గురుదోట్ల, దోర్నాల్, హరిదాస్‌పల్లి, కొండాపూర్‌కలాన్, గడ్డమీదిగంగారం, నర్సాపూర్, రాజాపూర్, నాగసమందర్, అల్లిపూర్, రుద్రారం, ఎబ్బనూర్, మోమిన్‌కలాన్, తరిగోపుల, కుక్కింద, ధర్మాపూర్ గ్రామాలను అతనికి కేటాయించినట్లు తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. మున్నూరుసోమారం, రాంపూర్‌తండా, నాగ్‌సాన్‌పల్లి, అవుసుపల్లి, మైలారం, మోమిన్‌ఖుర్దు, కుమ్మర్‌పల్లి, కొండాపూర్‌ఖుర్దు, కేరెళ్లి, అల్లాపూర్, అంతారం, బూర్గుగడ్డ, చింతకుంట, బాచారం, గట్టెపల్లి కాచారం గ్రామాలను ఆర్‌ఐ స్వప్న పర్యవేక్షిస్తారన్నారు.
పొలాల్లోకి పశువులను వదలొద్దని ఫిర్యాదు
చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించిన రైతులు
ధారూరు: మండల కేంద్రంలోని కొంతమంది పశువుల వ్యాపారులు మేత కోసం మూగజీవాలను పంట పొలాల్లోకి వదులుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం వారు సేకరించిన ఫొటోలు, వీడియోలను సీఐ రఘురామ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం పత్తి, మొక్కజొన్న కంది పంటలు వేశామని వ్యాపారులు పశువులను వదిలేయడంతో పంటలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే పశువులను పట్టుకుని జరిమానా విధిస్తామన్నారు. తిరుపతిగారి మల్లేశం తన పంట పొలాన్ని వ్యాపారుల పశువులు నాశనం చేశాయని ఎస్‌ఐ అనితకు ఫిర్యాదు చేశారు.
తప్పిపోయిన మహిళ.. స్నాప్‌చాట్‌తో ఆచూకీ
మీర్‌పేట: ఏడాది క్రితం అదృశ్యమైన మహిళ కేసును మీర్‌పేట పోలీసులు ‘స్నాప్‌చాట్’ ద్వారా ఛేదించారు. ఇన్‌స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. అల్మాస్‌గూడ వినాయకహిల్స్‌లో నివాసముండే ఓ మహిళ(22) కుటుంబ వివాదాల కారణంగా గతేడాది జూన్ 8వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి పోయింది. దీంతో ఆమె భర్త పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మహిళ ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు సెల్‌ఫోన్ కానీ, ఆమెకు సంబంధించి ఎలాంటి ఆధారాలు వెంట తీసుకెళ్లకపోవడంతో కేసును సవాలుగా తీసుకున్న మీర్‌పేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళ మరొకరి సెల్‌ఫోన్‌లో స్నాప్‌చాట్ ఐడీని సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా మహారాష్ట్ర ముంబయిలో ఆమెను అదుపులోకి తీసుకుని సోమవారం తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అక్కడికి ఎందుకు వెళ్లిందనే విషయంపై స్పష్టత లేదు.

17న లయన్స్ క్లబ్ ఇన్‌స్టాలేషన్

17న లయన్స్ క్లబ్ ఇన్‌స్టాలేషన్