
నేడు ఫోన్ ట్యాపింగ్ కేసువిచారణకు థారాసింగ్
తాండూరు: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ పీసీసీ ప్రధాన కార్యదర్శి, పెద్దేముల్ మాజీ జెడ్పీటీసీ జాదవ్ థారాసింగ్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తాను విచారణకు హాజరవుతానని ఆయన తెలిపారు.
ఏఈఓకు మెమో
దోమ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫార్మర్ రిజిస్ట్రీని వ్యవసాయ విస్తరణ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని సోమవారం ‘సాక్షి’లో దినపత్రికలో ఫార్మర్ రిజిస్ట్రీకి పైసా వసూల్ అనే కథనం ప్రచురితమయింది. ఇందుకు స్పందించిన ఉన్నతాధికారులు ఏఈఓ హారికకు మెమో జారీ వివరణ తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్‌రావుకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆయన ఏఈఓ హారికకు మెమో ఇచ్చి ఫార్మర్ రిజిస్ట్రీ ఆరోపణలపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలన్నారు. లేని పక్షంలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చేవెళ్ల: ముందు వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేయటంతో వెనకనుంచి బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చనువెళ్లి గ్రామానికి చెందిన తలారి నర్సింలు(38) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి తన బైక్‌పై చేవెళ్లకు వెళ్తుండగా పామెన బస్‌స్టేజి సమీపంలోని పెట్రోల్ బంకు సమీపంలో ముందు వెళ్తున్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో నర్సింలు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి ఎగిరి కిందపడి తీవ్రంగా గాయపడిన నర్సింలును చేవెళ్లలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేడు ఫోన్ ట్యాపింగ్ కేసువిచారణకు థారాసింగ్