
విద్యార్థులకు గుడ్డు ఇవ్వాల్సిందే
తాండూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనంలో కోడి గుడ్డు ఇవ్వాల్సిందేనని తాండూరు ఎంఈఓ వెంకటయ్య స్పష్టం చేశారు. ఇటీవల సాక్షి దినపత్రికలో ‘నెల రోజులుగా గుడ్డు లేదు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. సోమవారం ఉన్నతాధికారుల సూచన మేరకు ఏంఈఓ వెంకటయ్య చెన్‌గేస్‌పూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు నిబంధనలు పాటించాలన్నారు. వారానికి మూడు రోజులు విద్యార్థులకు గుడ్డు అందజేయాలన్నారు. అలాగే నాణ్యమైన భోజనం అందించాలని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీధర్, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఏంఈఓ వెంకటయ్య

విద్యార్థులకు గుడ్డు ఇవ్వాల్సిందే