
దశలవారీగా అభివృద్ధి పనులు
తాండూరు టౌన్: తాండూరు మున్సిపల్ పరిధిలో దశల వారీగా పలు అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి అన్నారు. సోమవారం సాయిపూర్ 9వ వార్డు పరిధిలోని కుమ్మరికుంటలో రూ.5 లక్షలతో మురుగు కాలువ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణంలోని అన్ని వార్డులను సుందరీకరించుటలో భాగంగా పలు సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో జనావాసాల మధ్య వరదనీరు, మురుగునీరు నిలవకుండా ఉండేందుకు సైడ్ డ్రైన్‌లను నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో పలు అభివృద్ధి పనులు చకాచకా జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు బంటు వేణుగోపాల్, బంటు మల్లప్ప తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి