
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్
బొంరాస్‌పేట: మండల పరిధిలోని జాతీయ రహదారి163 పక్కన ఆగి ఉన్న లారీని.. వేగంగా వెళ్తున్న బైక్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న తండ్రీకొడుకులు తీవ్ర గాయాలపాలయ్యారు. దౌల్తాబాద్ మండలం పోచమ్మగడ్డతండాకు చెందిన సబావత్ నెహ్రూనాయక్, తనకొడుకు అరుణ్‌తో కలిసి సోమవారం తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై కొడంగల్ వైపు వెళ్తున్నాడు. రేగడిమైలారం శివారు బాపనోనిబావి వద్ద మరమ్మతులకు గురై, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో కిందపడ్డారు. ఈ ఘటనలో తొమ్మిదేళ్ల అరుణ్ కాలు విరగగా, నెహ్రూనాయక్ తలకు గాయాలయ్యాయి. స్థానికులు వీరిని కొడంగల్ ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రేగడిమైలారం శివారులో ప్రమాదం
తండ్రీ కొడుకులకు గాయాలు