
నీటి సమస్య పరిష్కారానికి రూ.18 లక్షలు
మోమిన్‌పేట: గ్రామంలో తాగునీటి అవసరాలకు ఎస్‌డీఎఫ్ నిధుల నుంచి రూ.18లక్షలు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నాయకుడు సిరాజుద్దీన్ తెలిపారు. సమస్యలున్న కాలనీలో బోరుబావులు తవ్విస్తున్నామన్నారు. మొత్తం తొమ్మిది బోరు బావులు మంజూరు చేస్తే ఏడు బోర్లు వేయించామన్నారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రత్యేకచొరవ తీసుకుని నిధులు మంజూరు చేయడంతో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి స్వప్న, కాంగ్రెస్ నాయకులు ఎజాస్ పటేల్, రవి, హాజి, తాజుద్దీన్, మోసిన్, ముజ్జు తదితరులు ఉన్నారు.