పశుపోషకులకు ‘షాక్‌’ | - | Sakshi
Sakshi News home page

పశుపోషకులకు ‘షాక్‌’

Jul 15 2025 12:26 PM | Updated on Jul 15 2025 12:26 PM

పశుపో

పశుపోషకులకు ‘షాక్‌’

దుద్యాల్‌: విద్యుదాఘాతానికి మూగజీవాలు బలవుతున్నాయి. రూ.లక్షల విలువ చేసి కాడెడ్లు, పాడి పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఈదురుగాలులు, వర్షాలకు తెగిపడిన విద్యుత్‌ తీగల కారణంగా పలువురు రైతులు మృతి చెందగా మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. బాధిత కుటుంబాలకు విద్యుత్‌శాఖ పరిహారం ఇచ్చి ఆదుకుంటున్నా మెజార్టీ ప్రజలకు అవగాహన లేక నష్టపోతున్నారు. అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారనే అవవాదులు లేకపోలేదు. ఇప్పటికై నా అధికారులు గ్రామాల్లో విద్యుత్‌ ప్రమాదాలపై అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

మచ్చుకు కొన్ని..

● మండల పరిధిలోని పోలేపల్లి తండాకు చెందిన రాథోడ్‌ చందు నాయక్‌ పాడి గేదె ట్రాన్స్‌ఫార్మార్‌ వద్ద విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. దీంతో రైతు రూ.70 వేలు నష్టపోయాడు.

● పల్లెగడ్డకు చెందిన ముకుందరెడ్డికి చెందిన కాడెద్దు మృతి చెంది రూ.60 వేల నష్టం వాటిల్లింది.

● కొడగంల్‌ మండలం పలుగురాళ్ల తండాకు చెందిన మునేగారి సాయిలుకు చెందిన కాడెద్దు మృతి చెందడంతో రూ.50వేలు నష్టం చవిచూశాడు.

● రోటిబండ తండాకు చెందిన పాండు నాయక్‌(61) పశువులకు మేత కోస్తూ విద్యుదాఘాతంతో విగతజీవిగా మారాడు.

బాధితుల ఖాతాలో పరిహారం

విద్యుత్‌ ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కేసు నమోదు తర్వాత పశువైద్యుల సాయంతో పంచనామా చేయించాలి. పరిహారం పొందేందుకు కేసుకు సంబంధించిన పత్రాలతో విద్యుత్‌ శాఖ సహాయక ఇంజనీర్‌ దగ్గర దరఖాస్తు చేసుకోవాలి. మరణ ధ్రృవపత్రం, ఎఫ్‌ఐఆర్‌, పంచనామా నివేదిక, ఆధార్‌ కార్డు, బ్యాంకు పుస్తకం తదితర జిరాక్స్‌ కాపీలను జతచేసి విద్యుత్‌ ఏఈకి అందజేయాలి. ఏఈ నుంచి పత్రాలు ఏడీఈకి చేరుతాయి. ఆ పత్రాలు ఉన్నతాధికారులకు అందిన తర్వాత బాధితలు బ్యాంకులో పరిహారం జమచేస్తారు.

దరఖాస్తు ఇలా

● అంగవైకల్యం పొందితే ప్రమాద విషయం వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. బిల్లులు, ఇతర ఖర్చులకు సంబంధించిన నకలు జత చేసి విద్యుత్‌శాఖ ఏఈకి దరఖాస్తు సమార్పించాలి. ఉన్నాధికారుల పరిశీలన అనంతరం పరిహారం జమచేస్తారు.

● పశువులు మృత్యువాత పడితే విద్యుత్‌శాఖ అధికారులకు, పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వాలి. పశువైద్యాధికారి నుంచి పశువు ఖరీదు తెలిపే పత్రం, మృతి చెందినట్లు ధృవీకరణ పత్రం తీసుకోవాలి. మృతి చెందిన పశువు నిమిత్తం పరిహారం బాధితుడికి అందిస్తారు.

విద్యుత్‌ ప్రమాదాల కారణంగా

మూగజీవాల మృత్యువాత

అవగాహన లేక.. పరిహారం అందక

నష్టపోతున్న రైతులు

అర్హులకే పరిహారం

విద్యుత్‌ ప్రమాదాలకు సంబంధించిన బాధిత కుటుంబాలు అర్హులైతే పరిహారం తప్పకుండా అందుతుంది. ప్రమాద స్థాయిని బట్టి పరిహారం అందుతుంది. మూగ జీవాల విషయంలో పశువైద్యాధికారి ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు పరిగణలోకి తీసుకుంటున్నాం. విద్యుత్‌ సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం

– ఆనంద్‌, విద్యుత్‌ ఏఈ, దుద్యాల్‌

ప్రమాదం నిర్ధారనైతేనే..

మూగ జీవాలకు విద్యుత్‌ ప్రమాదం సంబవించినట్లైతే వెంటనే పశువైద్యులకు తెలియజేయాలి. ప్రమాదం జరిగిన పశువుకు నిర్ధారణ పరీక్షలు చేస్తాం. విద్యుత్‌ షాక్‌తోనే ప్రమాదం జరిగిందని నిజ నిర్ధారణ తర్వాత పశువుకు సంబంధించి మరణ దృవ పత్రం, పరీక్షకు సంబంధించిన ప్రతాలు పశు యాజమానికి అందజేస్తాం.

– పరమేశ్వర్‌, పశువైధ్యాధికారి, కొడంగల్‌

పశుపోషకులకు ‘షాక్‌’ 1
1/2

పశుపోషకులకు ‘షాక్‌’

పశుపోషకులకు ‘షాక్‌’ 2
2/2

పశుపోషకులకు ‘షాక్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement