
రాస్నంలో కంటి వైద్య శిబిరం
యాలాల: మండల పరిధిలోని రాస్నం గ్రామంలో ఎల్‌ఎన్‌ఆర్ యువసేన ఆధ్వర్యంలో సోమ వారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి పొరుగు గ్రామాల ప్రజలు సైతం విచ్చేసి కంటి పరీక్షలు చేయించుకున్నారు. వంద మందికి పైగా పరీక్షలు నిర్వహించిన సిబ్బంది అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మొగులయ్య, మల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు మన్నాన్, సాయన్న, హన్మయ్య, సత్తయ్య, ఖాజా పాష, సిద్దేశ్వర్ తదితరులు ఉన్నారు.
పోచమ్మతల్లి
ఆలయ నిర్మాణానికి విరాళం
కుల్కచర్ల: ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్ నాయకుడు రాజప్ప అన్నారు. మందిపల్‌లో నిర్మిస్తున్న పోచమ్మతల్లి ఆలయ నిర్మాణానికి సోమవారం ఆయన రూ.10వేలు విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆలయాల నిర్మాణాలకు గ్రామస్తులు ముందుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, ప్రసన్న, మొగులయ్య, వెంకటయ్య, ప్రసాద్, మహేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కల పరిరక్షణ
అందరి బాధ్యత
దౌల్తాబాద్: మొక్కలు నాటి పరిరక్షించడం బాధ్యతగా తీసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ లో సోమవారం వన మహోత్సవం కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీ ఓ మాట్లాడుతూ.. మొక్కలు మానవ మనుగడకు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వెంకట్‌రెడ్డి, వీర న్న, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దస్తప్ప, ఏపీఓ అంజిలయ్య, టీఏ కృష్ణహరి, పంచాయతీ కార్యదర్శి గోపాల్ తదితరులున్నారు.
సీఎంఆర్‌ఎఫ్‌తో
పేదలకు మేలు
కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రవి నాయక్
దుద్యాల్: ముఖ్యమంత్రి సహాయనిధి పథకంతో పేదలకు మేలు చేకూరుతుందని కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రవినాయక్ అన్నారు. మండల పరిధిలోని సాగారం తండాకు చెందిన నరేశ్ రాథోడ్‌కు సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.50 వేలు మంజూరయ్యాయి. ఈ చెక్కును సోమవారం బాధితులకు రవినాయక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గోపాల్ నాయక్, లాలు నాయక్, సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
పూడూరు: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని పీఏసీఎస్ చైర్మన్ సతీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని అంగడిచిట్టంపల్లి, నిజాంపేట్‌మేడిపల్లి, పోతిరెడ్డిపల్లి, పూడూరు, చీలాపూర్, ఎన్కేపల్లి తదితర గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్స్ తీసుకున్న వారు వెంటనే పనులను ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగయ్య, నాయకులు రవి, రాములు, తదితరులు పాల్గొన్నారు.

రాస్నంలో కంటి వైద్య శిబిరం

రాస్నంలో కంటి వైద్య శిబిరం

రాస్నంలో కంటి వైద్య శిబిరం

రాస్నంలో కంటి వైద్య శిబిరం