
చెంచుల సంక్షేమానికి కృషి
● అనంతగిరిపల్లి చెంచు కాలనీలో మల్టీ పర్పస్ సెంటర్ ● రూ.60 లక్షలతో భవన నిర్మాణం ● స్పీకర్ ప్రసాద్‌కుమార్
అనంతగిరి: చెంచుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి చెంచు కాలనీలో ప్రధానమంత్రి జన్మాన్ పథకం కింద నిర్మించనున్న మల్టీ పర్పస్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెంచు కాలనీల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రూ.60 లక్షల వ్యయంతో మల్టీ పర్పస్ సెంటర్ భవనా న్ని నిర్మించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, డీసీసీబీ డైరక్టర్ కిషన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు మైపాల్ రెడ్డి, షరీఫ్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్ల పల్లి రమేష్ కుమార్, సీనియర్ నాయకులు ఎండీ.హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.