87 కిలోల కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్‌ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

87 కిలోల కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్‌ సీజ్‌

Jul 14 2025 4:26 AM | Updated on Jul 14 2025 4:26 AM

87 కిలోల కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్‌ సీజ్‌

87 కిలోల కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్‌ సీజ్‌

ఆటో డ్రైవర్‌పై కేసు

తాండూరు రూరల్‌: అక్రమంగా తరలిస్తున్న కల్తీ అల్లంవెల్లుల్లి పేస్టు డబ్బాలను కరన్‌కోట్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన శనివారం మండల పరిధిలోని గౌతపూర్‌ చెక్‌పోస్ట్‌ వద్ద చోటు చేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. పట్టణంలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన సజ్జతుల్లా ఖాన్‌ తన ఆటోలో 87 కిలోల అల్లంవెల్లుల్లి పేస్ట్‌ డబ్బాలు తీసుకెళ్తున్నాడు. చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అల్లంవెల్లుల్లి పేస్ట్‌కు సంబంధించి డ్రైవర్‌ ఎలాంటి పత్రాలు చూపించలేదు. దీంతో కల్తీగా భావించి డ్రైవర్‌పై కేసు నమోదు చేసి ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. అల్లంవెల్లుల్లి శాంపిల్స్‌ ల్యాబ్‌ పంపిస్తామన్నారు.

ఆర్‌యూపీపీటీఎస్‌ జిల్లా కమిటీ నియామకం

షాద్‌నగర్‌: రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ (ఆర్‌యూపీపీటీఎస్‌) జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా నందిగామ మండలం నర్సప్పగూడ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్న అనురాధను, ప్రధాన కార్యదర్శిగా ఫరూఖ్‌నగర్‌ ఉర్దూమీడియం పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దార్ల రాఘవేంద్రాచారిని ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్‌ తెలిపారు.

డెలివరీ బాయ్‌పై దాడి కేసులో ఇద్దరి రిమాండ్‌

అత్తాపూర్‌: డెలివరీ బాయ్‌పై దాడి కేసులో ఇద్దరిని రిమాండ్‌కు తరలించిన ఘటన అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ రేహాన్‌ (20) పీవీఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నంబర్‌ 208 సమీపంలో జీప్టో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సులేమాన్‌ (25), యూనస్‌ (25)ను తోడుగా తీసుకువచ్చాడు. ఫుడ్‌ డెలివరీ చేసేందుకు ఆర్డర్లు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరో వ్యక్తిని ఎందుకు తీసుకువచ్చావు అని రేహాన్‌ సులేను ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మరో ఇద్దరు స్నేహితులు ఇమ్రాన్‌ (25) సలీం (22) పిలిచాడు. నలుగురు కలిసి రేహాన్‌పై దాడి చేయడంతో పాటు పదునైన కత్తితో ఎడమ చేయి, ఎడమ కాలుపై గాయాలు చేసి పారిపోయారు. రేహాన్‌ను చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. రేహాన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పీఎస్‌లను సందర్శించిన ట్రైనీ ఐపీఎస్‌లు

గచ్చిబౌలి: ఫీల్డ్‌ విజిట్‌లో భాగంగా ట్రైనీ ఐపీఎస్‌లు పోలీస్‌ స్టేషన్లను శనివారం సందర్శించా రు. గచ్చిబౌలి, రాయదుర్గం పీఎస్‌లో నలుగురు చొప్పున ట్రైనీ ఐపీఎస్‌లకు రిసెప్షన్‌, రికార్డులు, లాకప్‌, సీసీ కెమెరాల పరిశీలన ఎలా ఉంటుందో ఎస్‌హెచ్‌ఓలు వారికి వివరించారు. డయల్‌ 100 తో పాటు పీఎస్‌లకు ఫోన్లలో ఎలా ఫిర్యా దు చేస్తారు, పెట్రోల్‌ మొబైల్‌ సిబ్బంది ఎలా స్పందిస్తారు, ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, హోంగార్డు, కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌హెచ్‌ఓ వరకు వారు నిర్వహించే విధులను క్షణ్ణంగా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement