తాగునీటి సమస్య పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్య పరిష్కరించండి

Jul 14 2025 4:26 AM | Updated on Jul 14 2025 4:26 AM

తాగునీటి సమస్య పరిష్కరించండి

తాగునీటి సమస్య పరిష్కరించండి

పరిగి: మున్సిపల్‌ పరిధిలోని 13వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు పేర్కొన్నారు. శనివారం పరిగి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటయ్యకు కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వారంరోజులుగా సక్రమంగా తాగునీరు అందడంలేదని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఉన్న బోరుకు మోటర్‌ లేక నీటిసమస్య రోజు రోజుకు తీవ్రతరమవుతుందన్నారు. ఈ అధికారులు స్పందించి ఉన్న బోరులోనైన నూతన మోటర్‌ను ఏర్పాటు చేయించి నీటి సమస్య పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement