
చిత్రకారులను కళాకారులుగా గుర్తించాలి
ఆమనగల్లు: చిత్రకారులను కళాకారులుగా గుర్తించాలని చిత్ర కళాకారుల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రూపం వెంకట్‌రెడ్డి కోరారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో చిత్రకారులకు చేతినిండా పని ఉండేదని.. ప్రస్తుతం పనిలేక జీవనోపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో చిత్రకారులు చురుకుగా పాల్గొన్నారని, కేసులకు భయపడకుండా ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న బోర్డులను చెరిపి తెలంగాణ పదం చేర్చారని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చిత్రకారుల బాధ లను గుర్తించి న్యాయం చేయాలని కోరా రు. ఈ సమావేశంలో చిత్రకారులు కొండల్, లింగంగౌడ్, గోపి, యాదయ్య, మల్లేశ్ పాల్గొన్నారు.
చిత్ర కళాకారుల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి