
రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించండి
దౌల్తాబాద్: మండలంలోని ఆయా గ్రామాలకు నిర్మిస్తున్న బీటీ రోడ్ల నాణ్యతపై బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాజీ మహిపాల్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు బోడమర్రితండాకు వేసిన రోడ్డును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మండలంలో ఆయా గ్రామాలకు తండాలకు వేస్తున్న బీటీ రోడ్లను ఆంధ్రా కాంట్రాక్టర్లకు కమీషన్లకు అమ్ముకున్నారన్నారు. దీంతో వారు నాణ్యత లేకుండా రోడ్లును వేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు పకీరప్ప, ఆశప్ప, కేశవరెడ్డి. బాల్‌రాజు తదితరులున్నారు.