
సైబర్ నేరాలపై అప్రమత్తత ముఖ్యం
మోమిన్‌పేట: సైబర్ నేరాల పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సీఐ వెంకట్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సీఐ కార్యాలయంలో సైబర్ నేరాల అప్రమత్తతపై విలేకరులతో మాట్లాడారు. ఫోన్ పోగొట్టుకున్న మరు క్షణమే సిమ్‌ను బ్లాక్ చేయించాలన్నారు. ప్రతిఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ చేస్తుండటంతో సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు. సర్కిల్ పరిధిలో 8 సైబర్ కేసులు నమోదు చేశామన్నారు. మొత్తం రూ .42,58,555లు పోగొట్టుకోగా రూ.8,65,778 రికవరీ చేశామని వెల్లడించారు. ఇంకా పెండింగ్‌లో రూ.1,81,105 ఉన్నాయన్నారు. మోమిన్‌పేటకు చెందిన శివకుమార్ ఫోన్ పోగొట్టుకోగా అందులో ఉన్న రూ.1,44,000 పోయాయి. ఇలానే మర్పల్లికి చెందిన రాజువి రూ.10 లక్షలు పోయాయి. వెంటనే స్పందించి సిమ్ బ్లాకు చేయడంతో మొత్తం రికవరీ చేశామన్నారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కానిస్టేబుళ్లు జావిద్, అనిల్‌కుమార్ చాకచక్యంగా వ్యహరించి డబ్బులను రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. ఆయన వెంట ఎస్‌ఐ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
సీఐ వెంకట్