
అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వండి
అనంతగిరి: అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య పేర్కొన్నారు. ఈ నెల 15న నిర్వహించనున్న వీహెచ్‌పీఎస్ సభను విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం వికారాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వీహెచ్‌పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు రూ.6వేలు, వృద్ధులు, వితంతువులకు చేయూత పెన్షన్లను రూ.4వేలకు పెంచాలని డిమాండ్‌తో వికారాబాద్ జిల్లా కేంద్రంలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పెన్షన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరో పోరాటానికి తాము సిద్ధమయ్యామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మలికార్జున్, వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్యాం ప్రసాద్, నాయకులు సుధీర్, నర్సింలు, సుభాష్, పుష్పరాణి, పద్మమ్మ, జ్ఞానేశ్వర్ గౌడ్, రాజు, వెంకటయ్య, గౌసోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య
15న నిర్వహించనున్న సభకు మందకృష్ణ రాక