
పార్టీలో అందరూ సమానమే
తాండూరు: హస్తం పార్టీలో కొత్త, పాత అనే బేధాభావం లేదని అందరూ పార్టీ కుటుంబ సభ్యులేనని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జి, నారాయణపేట్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి క్యాంపు కార్యాలయంలో పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న నాయకులతో పాటు ముఖ్య కార్యకర్తలతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ పదవుల కోసం నియోజకవర్గం నుంచి వచ్చిన దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలిస్తున్నామన్నారు. పైరవీలతో ఏ నాయకుడికి పదవులు రావన్నారు. అందరూ సమష్టిగా పని చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఽథారాసింగ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి