
సాగు.. సాగదే!
ఎనిమిది మండలాల్లో వర్షాభావం..
● మోమిన్‌పేట్, వికారాబాద్, మర్పల్లి, బంట్వారం, నవాబుపేట్, కులకచర్ల, తాండూరు, బషీరాబద్ మండలాల్లో 30 మి.మీ.ల నుంచి 45 మి.మీ.ల లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ధ్రువీకరించింది.
● నైరుతి రుతు పవనాలు కారణంగా గత నెల జూన్ 10, 12, 13, 30వ తేదీల్లో వర్షాలు కురిశాయి.
● దీంతో నెల రోజుల్లో 72 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.
● జూలై 1నుంచి 3వ తేదీ వరకు కురిసిన వర్షాలతో 40 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.
● వ్యవసాయ అధికారులు లెక్కల ప్రకారం ఇది సాధారణం కన్నా తక్కువే.
● మరో వారం రోజులు వర్షాభావ పరిస్థితులు సంభవిస్తే రైతులు పొలాల్లో వేసుకొన్న పంటలు పూర్తిగా ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాండూరు: కర్షకులకు ఖరీఫ్ కష్టాలు మొదలయ్యాయి. పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొతర ఒక వైపు.. సరైన వర్షాలు కురవకపోవడం మరోవైపు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మే నెలలో దండిచికొట్టిన వానలు జూన్, జూలైలో ముఖం చాటేశాయి. తేలికపాటి వర్షాలకు కొంతమంది రైతులు ఆరుతడి పంటలు సాగు చేశారు. వీటికి అడపాదడపా వానలు కురుస్తున్నా సీజన్ ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కురవలేదు.
● జిల్లాలోని 20 మండలాల్లో 5.63 లక్షల ఎకరాల్లో ఈసారి పంటలు సాగయ్యే అవకాశం ఉంది.
● ఇప్పటికే సగం మంది పత్తి, కంది, మొక్కజొన్న వరి సాగు చేశారు. మిగిలిన వారు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
● ప్రస్తుత సీజన్‌లో 2.58 లక్షల ఎకరాల్లో పత్తి, 1.14 లక్షల ఎకరాల్లో కంది వేశారు.
● జిల్లా వ్యాప్తంగా ఈరోజు వరకు 146.4 మిల్లీలీటర్ల వర్షపాతానికి గాను 134.2 మిల్లీమీటర్లు నమోదైంది.
● తేలికపాటి భూముల్లో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే విత్తనాలు వేసుకునే అవకాశం ఉంది.
● నల్లరేగడి నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతే విత్తుకోవాలి.
● పెసర, మినుము తదితర స్వల్పకాలిక పంటలు 70శాతానికి పైగా సాగయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
దోబూచులాడుతున్న వరుణుడు
ఇప్పటి వరకు కురవని భారీ వర్షం
వర్షాలు లేక ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం
జిల్లాలో5.63 లక్షల ఎకరాలలో పంటల సాగుకు అంచనా
ఈ సీజన్‌లో జిల్లాలో 134.2ఎంఎంల సగటు వర్షపాతం నమోదు