
మట్టి గణపతినే పూజిద్దాం
జిల్లా బీసీ సంక్షేమాధికారి ఉపేందర్
అనంతగిరి: కుమ్మరి కుల వృత్తుల వారిని ప్రోత్సహించడానికి, పర్యావరణాన్ని పరిక్షించడానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నిర్మూలనకు మట్టి గణపతులనే పూజించాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి ఉపేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మట్టి గణపతి ప్రతిమలు కావాల్సిన వారు దిగువ తెలిపిన వారిని సంప్రదించాలని ఆయన కోరారు. కొడంగల్–అంజిలయ్య (93916 45200) తాండూర్–శ్రీశైలం (96405 18846), పరిగి–శంకర్ (96760 38986) వికారాబాద్–అంజిలయ్య (99664 66982)లో సంప్రదించాలన్నారు.
పోతులవాగు
కబ్జాదారులపై ఫిర్యాదు
ధారూరు: మండల పరిధిలోని అల్లాపూర్ సమీపంలోని పోతులవాగును కబ్జా చేసిన వ్యక్తులపై ఇరిగేషన్ ఏఈ నీరజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్నది కొంతే.. కొల్లగొట్టింది ఎంతో అనే శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన వార్తకు ఇరిగేషన్ అధికారులు స్పందించారు. వికారాబాద్ ఇరిగేషన్ డీఈ రవికుమార్‌తో కలిసి కబ్జాదారులైన జయలింగారెడ్డి, రసూల్‌ఖాన్‌లపై తగిన చర్య తీసుకోవాలని ఆమె ఎస్‌ఐ అనితను కోరింది. పోతులవాగును కబ్జాచేసి మట్టి పోసి రాళ్లతో గోడ నిర్మించి ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపి వాస్తవం మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. కాగా పోతులవాగును అరకిలోమీటర్ మేరకు కబ్జా చేసి తమ పొలంలోకి కలుపుకొన్నారని రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశం మేరకు నీటిపారుదలశాఖ అధికారులు పోతులవాగును, కోట్‌పల్లి ప్రాజెక్టు కుడి కాలువ రోడ్డును దున్నేసి కబ్జా చేసింది వాస్తమనని వారి పరిశీలనలో తేల్చారు. ప్రాథమిక విచారణ మేరకు ఇద్దరు వ్యక్తులు వాగును, కాల్వ రోడ్డును ఆక్రమించినట్లు గుర్తించారు.