
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
అనంతగిరి: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రాజు, అక్బర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 నెలలుగా ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరించడం తగదన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం పోలీసులు నాయకులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడు తేజ, జిల్లా నాయకులు పవన్, అభిషేక్, సిద్ధార్థ, కార్తీక్, బద్రీనాథ్, ఫైజల్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాజు