
దళితులపై దాడులను ఆపాలి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రాములు
అనంతగిరి: జిల్లాలో దళితులపై జరుగుతన్న దాడులను ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వికారాబాద్‌లోని సీఐటీయూ కార్యాలయంలో కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం దళితులపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక విచారణ చేపట్టి మరోసా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దాడులకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దళితుల హక్కులను కాపాడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య, మైపాల్, శ్రీనివాస్, చంద్రయ్య, నవీన్‌కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.