మొక్కల సంరక్షణతోనే మనుగడ
కుల్కచర్ల: మొక్కల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని కుల్కచర్ల ఎంపీడీఓ రామకృష్ణ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుల్కచర్ల మండలం కామునిపల్లి గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ అనితారెడ్డి, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మోర వెంకటయ్య, రఘునాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అల్లిపూర్‌లో..
ధారూరు: అల్లిపూర్ గ్రామంలో ధారూరు ఎంపీడీఓ నర్సింహులు, కాంగ్రెస్ నాయకుడు గంధం హన్మయ్యతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ప్రతీ ఇంటి ఆవరణలో మొక్క నాటి పెంచాలన్నారు. గ్రామ కార్యదర్శి సునీత తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి..
కొడంగల్ రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో వారు మొక్కలు నాటారు. వైస్ ప్రిన్సిపాల్ రఫియాఖానం, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ టి రాంబాబు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు ఆర్ శ్రీనివాస్, డాక్టర్ ఈ సోమ్లా తదితరులు పాల్గొన్నారు.
విరివిగా మొక్కలు నాటాలి
కొడంగల్: ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని కొడంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. బార్ అసోషియేషన్ వైస్ ప్రెసిడెంట్ బస్వరాజు, న్యాయవాదులు బి.కృష్ణయ్య, కె.రమేష్, మొహీద్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దుద్యాల్‌లో..
దుద్యాల్: హకీంపేట్ గ్రామంలో డాక్టర్ వందన ప్రధాన వీధుల గుండా తిరుగుతూ పర్యావరణంపై అవగాహన కల్పించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. పంచాయతీ కార్యదర్శి ఆనందం, మండల కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌హెచ్‌పీ నర్సమ్మ, అంగన్‌వాడీ టీచర్ రామేశ్వరి, ఏఎన్‌ఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కుల్కచర్ల ఎంపీడీఓ రామకృష్ణ


