కొహెడను డివిజన్‌గా ప్రకటించాలి
తుర్కయంజాల్: కొహెడ ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. తుర్కయంజాల్ సర్కిల్‌ను చార్మినార్ నుంచి ఎల్‌బీనగర్ జోన్‌లో చేర్చాలని, జీహెచ్‌ఎంసీ 53వ డివిజన్‌కు కొహెడ పేరు పెట్టాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇష్టానుసారంగా డివిజన్ల విభజన చేపట్టిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని అన్నారు. సుమారు 80వేలకు పైగా ఓటర్లున్న తుర్కయంజాల్ సర్కిల్‌ను రెండు డివిజన్లు మాత్రమే చేయడం ద్వారా పరిపాలన సౌలభ్యంగా ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మరో డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కోఆర్డినేటర్ కందాల బల్‌దేవ్ రెడ్డి, కో కన్వీనర్‌లు సింగిరెడ్డి రాంరెడ్డి, కొమిరిశెట్టి భిక్షపతి, అంగత్ కుమార్, నాయకులు బాల్‌రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.


