ప్రకృతి విపత్తులపై మాక్ ఎక్సర్‌సైజ్
సాక్షి, సిటీ బ్యూరో: ప్రకత్తి విపత్తులపై నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో సోమవారం మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఆర్‌ఓ వెంకటాచారి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్‌న్స్ హాల్‌లో మాక్ ఎక్సర్‌సైజ్ కార్యక్రమ నిర్వహణపై అగ్నిమాపక, ఎన్‌ఆర్‌డీఎఫ్, మెడికల్ ,రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న, హైడ్రా డీఎఫ్‌ఓ యజ్ఞ నారాయణ, సీఈ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, బాధితుల తరలింపు, పునరావాస కేంద్రాల ఏర్పాట్లు, వైద్య సహాయం అందించే విధానంపై అవగాహన కల్పించడమే మాక్ ఎక్సర్‌సైజ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ ఈవెంట్ కు జిల్లా ఫైర్ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. అధికారులు తమ శాఖల ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో చేపట్టిన ఏర్పాట్లను నిర్దేశించిన సమయానికి పూర్తిచేసి అందుబాటులో ఉంచాలని, కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులకు నిర్వహణ విధివిధానాలపై సలహాలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్డీసీలు రవి, శ్రీనివాస్, ఎన్‌ఆర్డిఎఫ్ మేనేజర్ భూపేందర్ కుమార్, పోలీస్, రెవిన్యూ, జిహెచ్‌ఎంసి, విద్యు త్, ఆర్‌అండ్‌బీ, హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


