
అశ్లీల వీడియో పోస్ట్ చేసిన బాలుడిపై కేసు
పరిగి: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు అశ్లీల వీడియోలను డౌన్‌లోడ్ చేసి తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ విషయా న్ని గుర్తించిన సైబర్ టిప్‌లైన్, సైబర్ సెక్యూరి టీ బ్యూరో హైదారాబాద్ అధికారులు జిల్లా పోలీసులకు తెలియజేశారు. వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు గత ఏప్రిల్ 30న కేసు నమోదు చేశాడు.
అప్రమత్తంగా ఉండాలి..
అనంతగిరి: అశ్లీల వీడియోలు చూసినా, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నారాయణరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ తరహా ఘటనలపై చన్గోముల్, పరిగి ఠాణాల్లో కేసులు నమో దు చేశామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఫోన్లు వాడున్న పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు.
ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య
దుద్యాల్: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని నాజుఖాన్‌పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ యాదగిరి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన బండమీది నర్సమ్మ (50) కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. వాటిని భరించలేని ఆమె పొలం వద్దకు వెళ్లి చీరతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుమారుడు ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కడుపునొప్పి భరించలేక యువతి..
యాచారం: కడుపు నొప్పి భరించలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని గునుగల్ గ్రామానికి చెందిన రమేశ్, రేణుక కూతురు జాహ్నవి(21) గురువారం సాయంత్రం తీవ్ర కడుపునొప్పితో బాధపడింది ఇది భరించలేని జాహ్నవి అదే రాత్రి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.