
‘ఆపరేషన్ సిందూర్’లో టెర్రరిస్ట్ స్థావరాలు నేలమట్టం
పూడూరు: ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలను కూల్చేసిన కల్నర్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ భూమిక ప్రధాన పాత్ర పోషించి విజయవంతం చేయడం జాతికి గర్వకారణమని జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్ అన్నారు. శుక్రవారం మాడల్ స్కూల్‌లో ఉపాధ్యాయ శిక్షణ అనంతరం ఎక్స్ సర్వీస్‌మెన్ గోవర్ధన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థులను సాహస నారీమనులుగా తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్