
రైతు నోట్లో ఎర్రమట్ట్టి!
మైనింగ్ తవ్వకాల నుంచి వస్తున్న దుమ్ము ప్రభావం పంటలపై పడుతోంది. లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసినా పంటలు చేతికి అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూడూరు: పంట పొలాల మధ్య మైనింగ్ తవ్వకాలు చేపట్టి రైతుల కష్టాన్ని కాలరాస్తున్నారు. కొందరు అక్రమార్కులు మైనింగ్ అధికారులతో చేతులు కలిపి లాటరైట్(ఎర్రమట్టి)ను తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. లాటరైట్‌ను సిమెంట్ తయారీలో ముడి పదార్థంగా వాడడంతో రాత్రిళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. విషయం తెలిసినా మైనింగ్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల పరిధిలోని మీర్జాపూర్‌లో పంట పొలాల మధ్య తవ్వకాలు చేపట్టడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ మొత్తంలో అనుమతులు తీసుకునిచుట్టూ ఉఉన్న భూమిలోనూ మట్టి తవ్వకాలు చేపట్టి సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పొలాల మధ్య లోతైన గుంతలు తవ్వడంతో భూగర్బజాలు తగ్గి బోర్లలో నీరు రావడం లేదని పరిసర ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలపై ఎర్రమట్టి దుమ్ము పడి పంటలు దెబ్బతింటున్నాయి. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎదగలేక ఎండిపోతున్న పైర్లు
అనుమతులకు మించి తవ్వకాలు
పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ అధికారులు