
భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు
ఆర్డీఓ వాసుచంద్ర
ధారూరు: భూ సమస్యల పరిష్కారానికి రెవె న్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ వాసుచంద్ర తెలిపారు. శుక్రవారం మండలంలోని కొండాపూర్ కలాన్, ధర్మాపూర్ గ్రామాల్లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. రెండు గ్రామాలకు చెందిన 28 మంది రైతులు భూ సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు.ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కా రం కోసమే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిందని తెలిపారు. ఇకపై కోర్టులకు వెళ్లకుండా గ్రామాల్లోనే భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు సాజిదాబేగం, శ్రీనివాస్‌లు, డీటీలు విజయేందర్, అనిల్‌బాబు, ఆర్‌ఐ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతతో
మానసిక ప్రశాంతత
కుల్కచర్ల: ఆధ్యాత్మికత చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని పరిగి ఎమ్మెల్యే టీ.రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పీరంపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభు త్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, ఎస్‌ఐ అన్వేష్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య పనుల్లో
నిరక్ష్యం తగదు
జిల్లా పంచాయతీ అధికారి జయసుధ
యాలాల: గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని దేవనూరు, అగ్గనూరు గ్రామాల్లో ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పంచాయతీల్లో సిటీజన్ లాగిన్‌లో ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించాలన్నారు. తడిపొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని సర్వే అధికారి, ఏఓ శ్వేతరాణిని ఆదేశించారు. పంచాయతీ కార్మికులు పాలసీ చేసుకోవాలని, పాలసీ చేసుకోనివారు వెంటనే చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీ కార్మికులకు సకాలంలో వేతనాలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పుష్పలీల, ఎంపీఓ యాదయ్య, కార్యదర్శులు పావనిరెడ్డి, తారకచారి, రమాదేవి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సర్కారు బడుల్లోనే
నాణ్యమైన విద్య
రంగారెడ్డి డీఈఓ సుశీందర్‌రావు
తుక్కుగూడ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని డీఈఓ సుశీందర్‌రావు పేర్కొన్నారు. పురపాలిక సంఘం పరిధిలోని తుక్కుగూడ, సర్ధార్‌నగర్, మంఖాల్ గ్రామాల్లో శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాలే నిదర్శనమన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రి అందజేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి, మంచి భవిష్యత్‌ను అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ కస్నానాయక్, హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు