సమాఖ్యలో రాజకీయం! | - | Sakshi
Sakshi News home page

సమాఖ్యలో రాజకీయం!

May 9 2025 8:20 AM | Updated on May 9 2025 8:20 AM

సమాఖ్యలో రాజకీయం!

సమాఖ్యలో రాజకీయం!

కొందరు నేతల కనుసన్నల్లోనే మహిళా సంఘాల ఎన్నికలు

వికారాబాద్‌: పారదర్శకంగా.. తటస్తంగా.. స్వతంత్రంగా జరగాల్సిన ఎన్నికల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతోంది. ఇందుకు జిల్లా మహిళా సమాఖ్య ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. మూడు రోజుల క్రితం ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండానే కొందరు నేతల కనుసన్నల్లోనే ఇవి జరిగాయి. ఐకేపీ అధికారులకు అనుకూలంగా ఉండే వారినే ఎంపిక చేశారనే విమర్శలు ఉన్నాయి. గ్రామ సంఘాల ఎన్నికలు మొదలు.. మండల, క్లస్టర్‌, జిల్లా స్థాయిలోనూ ఇదే తరహాలో వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 5న జిల్లాలో మహిళా సమాఖ్య ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి, నూతన కార్యవర్గానికి సంబంధించి పదాధికారులను ఎన్నుకున్నారు. ఎన్నికల విషయంలో మహిళా సంఘాల సభ్యులు, పలు మండలాల అధ్యక్షులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించలేదని ఆరోపిస్తున్నారు.

ఎన్నికల బైలా ఇలా..

ఎన్నికల బైలా ప్రకారం గ్రామ, మండల, జిల్లా సమాఖ్యలకు అధ్యక్షులుగా ఎన్నికై న వారు మూడు పదవుల్లో కలిపి మూడు సంవత్సరాల కంటే ఎక్కు వ కాలం కొనసాగడానికి వీలు లేదు. మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నికై న వారు అంతకుముందే గ్రామ సంఘం అధ్యక్షురాలిగా రెండేళ్లు కొ నసాగితే మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఏడా ది మాత్రమే బాధ్యతలు వహించి అనంతరం వేరే వా రికి ఆ బాధ్యతలు అప్పగించాలి. మండల, జిల్లా స మాఖ్యలోనూ ఇదే పద్ధతి పాటించాల్సి ఉంటుంది. కార్యవర్గం ఎన్నికలో లాటరీ పద్ధతి పాటించరాదు. మెజార్టీ సభ్యుల ఆమోదంతో ఎంపిక జరగాలి.

అన్నీ పక్కన పెట్టి..

జిల్లాలో మొత్తం 19 మండల సమాఖ్యలు.. 13,138 స్వయం సహాయక సంఘాలు.. 1.40 లక్షల సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే గ్రామ, మండల సమాఖ్యలకు కార్యవర్గాలు ఉన్నాయి. రెండు మండల సమాఖ్యలకు ఒకటి చొప్పున క్లస్టర్లు ఏర్పాటు చేసి.. క్లస్టర్‌కు ఒకరి చొప్పున ఎన్నుకున్నారు. వీరు జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, కోశాఽధికారి, పదాధికారులను ఎన్నుకున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ప్రక్రియలో బైలా నిబంధనలు పాటించలేదని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు పరిగి క్లస్టర్‌లో నలుగురు మహిళా అధ్యక్షులు కలిసి ఒకరిని ఎన్నుకోవాల్సి ఉండగా ఇందులో ఇద్దరు పోటీ పడ్డారు. మిగతా ఇద్దరు ఒకరిని ఎన్నుకునేందుకు నిర్ణయించుకోగా ఓటింగ్‌ పెట్టకుండా ల్యాటరీ పద్ధతిలో ఒకరిని ఎన్నుకున్నారు. దీంతో మిగతా ఇద్దరు మహిళల మద్దతు ఉన్న సభ్యురాలు కాకుండా మరో మహిళ ఎన్నికయ్యింది. ఎన్నికల అధికారులకు జిల్లాకు చెందిన కొంత మంది ముఖ్య నేతలు ఫోన్లు చేసి వారు సూచించిన వారినే ఎన్నుకునేలా ఒత్తిడి తెచ్చినుట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం పలు రాయితీలు, ఉపాధి అవకాశాలు మహిళా సంఘాల ద్వారానే కల్పిస్తున్న నేపథ్యంలో రాజకీయ ప్రమేయం మరింత పెరిగింది.

లక్ష్యం పక్కదారి..

మహిళలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పురోగతి సాధించాలనే ఉద్దేశంతో 1996లో గ్రామీణ పేదరిక నిర్మూలనసంస్థను ఏర్పాటు చేశారు. మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు, దురాచారాల నుంచి వారిని బయటపడేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట్లో సంస్థ అధికారులు, ఉద్యోగులు ఈ దిశగా పని చేశారు. ప్రస్తుతం ఆ దృక్ఫథాన్ని గాలికొదిలేశారు. కేవలం రుణాలు ఇప్పించడం.. తిరిగి వసూలు చేయడంపేనే దృష్టి సారించారు. దీంతో అనుకున్న లక్ష్యం పక్కదారి పడుతోంది. ఉదాహరణకు పరిగి మండలానికి చెందిన ఓ మహిళా సభ్యురాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా చాలా కాలం పని చేశారు. ఆమె పదవిలో ఉన్నంత కాలం సభలు, సమావేశాలు, మీటింగుల కోసం తిప్పడం తప్ప.. ఆమె ఆర్థిక ఎదుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఆమె ఇళ్లలో పనిచేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. మహిళాసమాఖ్య ఎన్నికల్లో లాటరీ పద్ధతి పాటించడంపై డీపీఎం వీరయ్యను వివరణ కోరగా మహిళల కోరిక మేరకే అలా వ్యవహరించామని తెలిపారు. ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.

అధికారులకు అనుకూలంగాఉండేవారినే ఎంపిక

మూడు రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా ప్రక్రియ పూర్తి

మండల, క్లస్టర్‌ స్థాయిలోనూ ఇదే తంతు

జిల్లాలో మండల సమాఖ్యలు: 19

స్వయం సహాయక సంఘాలు: 13,138

సభ్యులు: 1.40 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement