
ఆధ్యాత్మిక చింతన అవసరం
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
మోమిన్‌పేట: సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన అవసరమని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని సయ్యద్‌అల్లిపూర్ హనుమాన్ ఆలయంలో ధ్వజస్తంభ, నవగ్రహాలు, బొడ్రాయి ప్రతిష్ఠాపన పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సమాజంలో ప్రజలు ఎన్నో ఒత్తిడిలకు గురవుతుంటారని.. ఇలాంటి సమయంలో దైవారాధన చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సుభాష్‌గౌడ్, మండల కార్యదర్శి సురేందర్, నాయకులు మాణయ్య, నరోత్తంరెడ్డి, మహంత్‌స్వామి, ఎరాజ్, సుభాష్ పాల్గొన్నారు.
రథోత్సవంలో..
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో బుధవారం రాత్రి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి రథోత్సవం వైభవంగా సాగింది. ఈ శోభాయాత్రలో చిన్నారులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేడుకల్లో స్పీకర్ ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపనలో..
బంట్వారం: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని రొంపల్లిలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవ భక్తిని అలవర్చుకుని ప్రశాంత జీవనం సాగించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు డు పోచారం వెంకటేశం, మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మ హేందర్‌రెడ్డి, నాయకులు రాములు యాదవ్, రాధా కృష్ణ గౌడ్, మొగులయ్య, పురుషోత్తంరెడ్డి, కోట చంద్రశేఖర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.