
భారత సైన్యానికి సెల్యూట్
● ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ● జాతీయ జెండాలతో ప్రదర్శన
పరిగి: చాలా కచ్చితత్వంతో పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన భారత సైన్యానికి ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయాల్సిందేనని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంతో గురువారం పరిగి పట్టణ కేంద్రంలోని కొడంగల్ చౌరస్తాలో భారత సైన్యానికి సంఘీభావంగా జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పహల్గం ఉగ్ర దాడికి ప్రతీకారమే ఆపరేషన్ సిందూర్ అని పేర్కొన్నారు. భారత సైన్యం ఉగ్రమూకలను అంతమొందించడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. వ్యూహాత్మకంగా మెరుపు దాడులతో పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తి చేసి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారన్నారు. త్రివిధ దళాల పనితీరు అభినందనీయమన్నారు. దేశ పౌరులను సైన్యం కాపాడుతుందని.. వారి త్యాగాన్ని ఎన్నటికీ మరవలేమన్నారు. దేశ భద్రత విషయంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, పార్టీ ప్రధాన కార్యదర్శి హన్మంత్ మదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, దోమ మండల అధ్యక్షులు విజయ్‌కుమార్‌రెడ్డి, సురేందర్ నాయకులు పాలాద్రి శ్రీనివాస్, యాదవరెడ్డి, శ్రీనివాస్, శాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.