
రైల్వే ప్రైవేటీకరణను విరమించుకోవాలి
● సీఐటీయూ నేతల డిమాండ్ ● తాండూరు రైల్వే స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం
తాండూరు టౌన్: రైల్వే ప్రైవేటీకరణను కేంద్ర ప్ర భుత్వం వెంటనే విరమించుకోవాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం ఆ యూనియన్ ఆధ్వర్యంలో తాండూరు రైల్వే స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దేశ సంపద దోచి పెట్టేందుకే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే రైల్వేను ప్రైవేటీకరిస్తోందని దుయ్యబట్టారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహ రించుకొని రైళ్లలో సౌకర్యాలను మెరుగు పరచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు చంద్రయ్య, సురేష్, మానెప్ప,సంజీవ్,అంజయ్య, బాలస్వామి, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.