అంటరానితనాన్ని నిర్మూలించాలి
బొంరాస్‌పేట: శాస్త్ర సాంకేతికత రంగం కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో సైతం గ్రామాల్లో కుల వివక్ష ఉండడం అత్యంత దారుణమని ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని ఏర్పుమళ్లలో డా.బీఆర్.అంబేడ్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏర్పుమళ్లలోనూ రెండు గ్లాసుల విధానం, దళితులకు క్షౌవరం చేయకపోవడం బాధాకరమన్నారు. అంటరానితనం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దళితులు, పేదల భూములు కాపాడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి జుడీషియల్ కమిటీ వేసి కాపాడాలని ఆయన కోరారు. వక్తలు కట్టెల మల్లేశం, బైరెడ్డి సతీష్, కాంగ్రెస్ పార్టీ జాతీయ యూత్ కోఆర్డినేటర్ కృష్ణంరాజు, తదితరులు పాల్గొని స్థానికులకు చైతన్య పరిచారు. అంతకుముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ధూంధాం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నాయకులు రమేశ్‌బాబు, సూర్యానాయక్, వెంకటయ్య, చంద్రయ్య, ప్రజాసంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ వినోద్‌కుమార్
ఏర్పుమళ్లలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ


