అంకితభావంతో పని చేయండి
ఎస్పీ నారాయణరెడ్డి
అనంతగిరి: జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 17మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లగా ప్రమోషన్ వచ్చినట్లు ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్‌లోని తన చాంబర్‌లో పదోన్నతి పొందిన వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రమోషన్ అంటే కేవలం హోదా పెరగడం మాత్రమే కాదని.. బాధ్యత మరింత పెరిగిందని గుర్తుంచుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో మరింత అంకితభావం, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
హామీలన్నీ అమలు చేస్తాం
స్పీకర్ ప్రసాద్ కుమార్
మోమిన్‌పేట్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో 42 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబంధు పథకం అమలు చేసినట్లు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి అని అన్నారు. త్వరలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.లక్షతోపాటు తులం బంగారం అందజేస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టామని, త్వరలో పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు నరోత్తం రెడ్డి, సుభాష్ గౌడ్, సురేందర్, సిరాజుద్దీన్, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఆర్‌ఐ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిని
ప్రారంభించాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన పలువురు నాయకులతో నూతన ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రిలో వసతులు లేక రోగు లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. భవ నం పూర్తయి ఆరు నెలలు కావస్తున్నా ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ స్పందించి ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శివ రాజు, మోహన్‌రెడ్డి, సుధాకర్ ఆచారి, రాఘవేందర్, శ్రీనివాస్, రాములు, అనంతయ్య, గోపాల్ పాల్గొన్నారు.
జేఈఈ మెయిన్స్‌లోపరిగి విద్యార్థి ప్రతిభ
ఆల్‌ఇండియా జనరల్ కేటగిరీలో
103 ర్యాంక్
పరిగి: జేఈఈ మెయిన్స్‌లో పరిగి విద్యార్థి సత్తాచాటాడు.ఆల్ ఇండియా జనరల్ కేటగిరీ లో 103 ర్యాంక్ సాధించాడు. పరిగి టీచర్స్ కాలనీకి చెందిన కనకం ప్రణవ్‌తేజ్ జేఈఈ మెయిన్స్‌లో 300 మా ర్కులకు గాను 280 మార్కులు సాధించాడు.
అంకితభావంతో పని చేయండి
అంకితభావంతో పని చేయండి
అంకితభావంతో పని చేయండి


