
బీసీల రిజర్వేషన్‌ను 52శాతానికి పెంచాలి
పరిగి: బీసీలకు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీఎంపీ జిల్లా అధ్యక్షుడు గట్యానాయక్ ఆరోపించారు. మంగళవారం ఆయన పట్టణ కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 9న బీపీఎం ఆధ్వర్యంలో జాగోరే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈవీఎం మిషన్ల ట్యాంపరింగ్‌తో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని చెప్పడమే ఈ కార్యక్రమ ఉద్దేశం అన్నారు. సుప్రీం కోర్టు సైతం ఈవీఎం ద్వారా ఎన్నికలు పారదర్శకంగా జరగవని తేల్చి చెప్పిందన్నారు. వక్ఫ్ బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అంబేడ్కర్‌పై అనుచిత వాఖ్యల చేశారని వారిపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌నాయక్, నాయకులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బీఎంపీ జిల్లా అధ్యక్షుడు గట్యానాయక్