తాండూరు రూరల్: మెనూ ప్రకారం కేజీబీవీ విద్యార్థినులకు భోజనం అందడం లేదని తాండూరు మున్సిపల్ మేనేజర్ నరేందర్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశాల మేరకు ఆయన మండలంలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న కేజీబీవీని ఆయన తనిఖీ చేశారు. పాఠశాల, కళాశాలలో తరగతి గదులు, వంటగదితో పాటు బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థినులకు డైనింగ్‌హాల్ లేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకొని వైద్యం అందించాలని ఎస్‌ఓకు ఆదేశించానన్నారు. కార్యక్రమంలో స్పెషలాఫీసర్ ఆశలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
తాండూరు మున్సిపల్ మేనేజర్ నరేందర్‌రెడ్డి