తాండూరు టౌన్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేపట్టకుండా గ్రూప్ 1, 2, 3 ఫలితాలను విడుదల చేయడం అన్యాయమని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కె.మల్లికార్జున్ మాదిగ అన్నారు. బుధవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది ఆగస్టు 1వ తేదీన ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణకు చట్ట బద్ధత కల్పిస్తామన్నారు. ఇచ్చిన నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలయ్యేలా చూస్తానని మాట ఇచ్చారన్నా రు. కానీ ఆ మాట నిలబెట్టుకోకుండానే గ్రూప్ 1, 2 ఫలితాలను ప్రకటించారన్నారు. ఇప్పటికై నా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి, వర్గీకరణ ప్రకా రమే ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు శివాజీ, మహేందర్, సూర్య ప్రకాష్, ఉమాశంకర్, పరశురాం, నవీన్, శివకుమార్, బస్వరాజు, సిద్ధు, రాము పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు
మల్లికార్జున్ మాదిగ