
ధారూరు: సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయకుండానే వేసిన రోడ్డు
ధారూరు: ఆరేళ్లయినా.. అభివృద్ధి పనుల్లో ఎటువంటి పురోగతి లేదు. పాలకుల హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో కోట్‌పల్లి చౌరస్తా నుంచి పోలీస్‌స్టేషన్ వరకు 20 మీటర్ల వెడల్పుతో ఫోర్‌లైన్ రోడ్డును, అందులో ఒకటిన్నర మీటర్ల డివైడర్‌లో సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేయడానికి రూ.కోటి నిధులు మంజూరయ్యాయని 2018 ఫిబ్రవరిలో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రకటించారు.
అప్పటి మంత్రులు మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీ, ఎమ్మెల్సీ నిధుల నుంచి మండలానికి మరో రూ.2.07 కోట్లు మంజూరు చేశారని, వీటితో వివిధ అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. కానీ నిధుల జాడ లేదు.. నేటికీ పనులు మొదలవ్వలేదు. దీంతో స్థానికులు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.