పూడూరు: గుర్తు తెలియని శవం లభ్యమైన సంఘటన మండల పరిధిలోని సోమన్‌గుర్తి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. చన్గోముల్ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని సోమన్‌గుర్తి అటవీ ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన ఓ గుర్తు తెలియని శవం లభ్యమైందని తెలిపారు. ఉపాధిహామీ కూలీలు పనులు చేస్తుండగా కాలిపోయిన అస్థిపంజరాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పదిహేను రోజుల క్రితం ఈ సంఘటన జరిగి ఉండవచ్చని పరిగి డీఎస్పీ సీఐ వెంకటరామయ్య అనుమానిస్తున్నారు. ఈ మేరకు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లతో వివరాలు సేకరించారు. సంఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టేదిలేదని పోలీసులు హెచ్చరించారు.