
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత విభావరి (మ్యూజికల్ లైవ్ కన్సర్ట్) నిర్వహిస్తుంటారనే విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో నవంబరు 8న మ్యూజికల్ లైవ్ కన్సర్ట్ చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది.
‘ట్రెండ్‌సెట్టర్స్.లైవ్’ సుధాకర్ ఈ వేడుకని నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఇళయరాజా, మంత్రి టీజీ భరత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘ట్రెండ్ సెట్టర్స్.లైవ్’ సుధాకర్ మాట్లాడుతూ– ‘‘సినీ సంగీతానికి జీవనాడిగా ఉన్న ఇళయరాజాగారితో ఈ సంగీత విభావరి నిర్వహించనుండటం సంతోషంగా ఉంది. 40 మంది సభ్యులతో ఆయన ఈ లైవ్ కన్సర్ట్‌కు హాజరవుతున్నారు’’ అని చె΄్పారు.