పేరూరు చెరువు పనులు వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

పేరూరు చెరువు పనులు వేగవంతం చేయండి

Apr 5 2026 9:18 AM | Updated on Apr 5 2026 9:18 AM

తిరుపతి అర్బన్‌: పేరూరు చెరువు నుంచి అవిలాల చెరువు సఫ్లై ఛానల్‌ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లో జేసీ గోవిందరావుతో కలసి ఇరిగేషన్‌, తుడా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.8 కోట్లతో పనులు చేపట్టడానికి టెండర్లు ఆహ్వానించాలని చెప్పారు. అవిలాల చెరువు సుందరీకరణలో భాగంగా కరకట్టపై పనులు, ఫుడ్‌ కోర్టు, వాకింగ్‌ ట్రాక్‌, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ రాధాకృష్ణమూర్తి, ఈఈ వెంకటేశ్వర్‌ ప్రసాద్‌, తుడా సెక్రటరీ శ్రీకాంత్‌బాబు, తుడా ఎస్‌ఈ రవీంద్ర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement