టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరిక

Apr 5 2026 9:18 AM | Updated on Apr 5 2026 9:18 AM

రైల్వేకోడూరు అర్బన్‌: మండలంలోని ఉర్లగడ్డపోడు పంచాయతీ ఎగువపల్లికి చెందిన 20 కుటుంబాలకు చెందిన టీడీపీ నాయకులు శనివారం వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, ప్రజలు విసుగు చెంది వైఎస్సార్‌ సీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే సంక్షేమానికి, అభివృద్ధికి దూరమయ్యామని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. అందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన రావడానికి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా కృషి చేయాలని తెలిపారు. పార్టీలోకి వచ్చిన సురేష్‌కుమార్‌రాజు, మురళీరాజు, నవీన్‌కుమార్‌, సాయి, అనీల్‌, అరుణ్‌, శంకర్‌, పవన్‌కుమార్‌, కళ్యాణ్‌, వెంకటేస్‌, కృష్ణయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, పంజం వేణుగోపాల్‌రెడ్డి, రత్నమ్మ, సీహెచ్‌ రమేష్‌, నందా బాల, బండారు మల్లి, నారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement