2022 ఏప్రిల్ 4న తిరుపతి జిల్లా ఏర్పాటు 36 మండలాలు..ఏడు నియోజకవర్గాలు శ్రీ పద్మావతి అతిథి గృహం వేదికగా కలెక్టరేట్ ఒకే చోట 30 విభాగాలు జిల్లాకు సముద్రతీరం
తిరుపతి అర్బన్: అధికార పరిధి ఎక్కువగా ఉండడం వల్ల పథకాల అమలు, శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనపై పర్యవేక్షణ కష్టతరమవుతుంది. అధికారి వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించే వీలు కలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే తిరుపతి జిల్లా ఏర్పాటైంది. ఆధ్యాత్మిక రాజధానిగా పేరుపొందిన తిరుపతి నగరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ 34 మండలాలు, 7 నియోజకవర్గాలు, 4 రెవెన్యూ డివజన్లతో 2022 ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో టీటీడీకి చెందిన శ్రీపద్మావతి అతిథి గృహాన్ని కలెక్టరేట్‌కు కేటాయించారు. అందులో ఒకే చోట 30కి పైగా విభాగాలు ఉండేలా చర్యలు చేపట్టారు. కీలకమైన అన్ని శాఖలు ఒకే చోట ఉండడంతో జిల్లా ప్రజలకు సౌకర్యంగా ఉంది. ప్రజలు కలెక్టరేట్‌కు వస్తే అన్ని సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కలిగింది. గత సర్కార్ తీసుకున్న చక్కటి నిర్ణయం ఎంతో సౌకర్యంగా ఉందని ప్రజలు చెబుతున్నారు. అలాగే జిల్లాకు 72 కిలోమీటర్ల సముద్రతీరాన్ని తీసుకొచ్చారు. మరోవైపు శ్రీహరికోట రాకెట్ కేంద్రం తిరుపతి జిల్లా సొంతమైంది. ఈ క్రమంలోనే జిల్లా దినదినాభివృద్ధి చెందుతుందంటే అప్పటి పాలకులు ముందుచూపులో భాగంగా తీసుకున్న నిర్ణయాలే కారణామని పలువురు చర్చించుకుంటున్నారు.


