శాస్త్రవేత్తకు బెదిరింపులు | - | Sakshi
Sakshi News home page

శాస్త్రవేత్తకు బెదిరింపులు

Mar 27 2026 9:48 AM | Updated on Mar 27 2026 9:48 AM

తొట్టంబేడు: మండలంలోని శాస్త్రవేత్తను హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు పోలీసులు ద్వారా బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. తొట్టంబేడు మండలం గ్రామీణ శాస్త్రవేత్తలు తయారు చేసిన సుమారు రూ.5 కోట్ల విలువ చేసే జీవామృతాన్ని హైదరాబాద్‌కు చెందిన దుర్గాప్రసాద్‌ అనే వ్యక్తి తీసుకెళ్లి తిరిగి డబ్బు చెల్లించకుండా గ్రామీణ శాస్త్రవేత్తలను మోసం చేశాడు. గ్రామీణ శాస్త్రవేత్తలకు దుర్గాప్రసాద్‌ డబ్బులు చెల్లించకపోవడంతో కోర్టుకు వెళ్లారు. అయినా ఇప్పటి వరకు దుర్గాప్రసాద్‌ డబ్బులు చెల్లించలేదు. అతను రాజకీయంగా పలువురి రాజకీయ నాయకుల ద్వారా పోలీసులతో తొట్టంబేడులో వివాదాలకు ఆజ్యం పోస్తున్నాడు. అందులో భాగంగా శ్రీకాళహస్తిలోని పోలీసులకు దుర్గాప్రసాద్‌ వాస్తవాలు చెప్పకుండా, అబద్ధాలు చెప్పి పోలీసులను జీవామృతం ఫ్యాక్టరీ దగ్గరకు తీసుకువచ్చాడు. పోలీసులు కూడా వాస్తవాలు తెలసుకోకుండా శాస్త్రవేత్త కారాకొల్లు శాస్త్రవేత్త చంద్రశేఖర్‌ నాయుడిని బెదిరించారు. గ్రామీణ శాస్త్రవేత్తలకు డబ్బులు చెల్లించకుండా రాజకీయంగా, పోలీసులు పరంగా వివాదాలకు ఆజ్యం పోశారు. జీవామృతం ఫ్యాక్టరీ వద్ద హైదరాబాద్‌ చెందిన నాన్‌ లోకల్‌ వ్యక్తులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని స్థానికులు అంటున్నారు. పోలీసులు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా శాస్త్రవేత్తను బెదిరించడం సబబు కాదని స్థానికులు అంటున్నారు. కాగా శ్రీకాళహస్తి గ్రామీణ శాస్త్రవేత్తలు నాన్‌ లోకల్‌ వ్యక్తులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

దొంగ ప్రేమజంట అరెస్టు

తొట్టంబేడు: ఆ ప్రేమజంట రూటే వేరు. దర్జాగా దొంగలించడం ఆ మొత్తంతో జల్సాలు చేయడం వారి నైజం. తొట్టంబేడు పోలీసు కథనం మేరకు.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన కిరణ్‌ ఐటీఐ వరకు చదివాడు. జియో టవర్‌ వద్ద టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. అయితే అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు. కసి పెంచుకున్న అతను తన ప్రియురాలితో కలసి స్కెచ్‌వేశాడు. అదే కంపెనీకి చెందిన టవర్ల వద్ద పరికరాలను చోరీ చేసేందుకు ప్లాన్‌ వేశాడు. సెల్‌ఫోన్‌ వాడితే పోలీసులకు పట్టుపడతామని, వాకీటాకీలతో చోరీలకు పాల్పడ్డారు. పోలీసు రెక్కీతో బుధవారం పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 40 రోటర్లు, డమ్మీగన్‌, రెండు వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

226 మంది రోగుల ఎంపిక

తిరుపతి తుడా: స్విమ్స్‌ ఆస్పత్రిలో టీటీడీ ప్రాణదాన పథకం కింద ఉచిత శస్త్ర చికిత్సల కోసం 226 మంది రోగులను ఎంపిక చేసినట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్వీ కుమార్‌ తెలిపారు. ఆస్పత్రిలోని డైరెక్టర్‌ కార్యాలయంలో గురువారం పద్మావతి చిన్న పిల్లల హృదయాల డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, స్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌, ఆర్‌ఎంఓ కోటిరెడ్డి, బర్డ్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ రామ్మూర్తి, టీటీడీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కుసుమకుమారి, రుయా హాస్పిటల్‌ డాక్టర్‌ సుబ్బలక్ష్మి, మెటర్నటీ హాస్పిటల్‌ డాక్టర్‌ శ్రీనివాసులు, స్విమ్స్‌ చీఫ్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ డీ గోపి తదితరులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉచిత శస్త్ర చికిత్సకు పేదరోగులను ఎంపిక చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్డియాలజీ విభాగంలో నలుగురు, కార్డియో థొరాసిక్‌ 19 మంది, ఈఎన్‌టీ ఒకరు, జనరల్‌ సర్జరీ 9 మంది, మెడిసిన్‌ విభాగంలో 20, మెడికల్‌ ఆంకాలజీలో ముగ్గురు, నెప్రాలజీలో 72 మంది, న్యూరాలజీకి సంబంధించి 15 మంది, న్యూరో సర్జరీకి 48 మంది, గైనకాలజీలో ఇద్దరు, రేడియేషన్‌ ఆంకాలజీ ఇద్దరు, రేడియాలజీ ఇద్దరు, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో 24 మంది, సర్జికల్‌ ఆంకాలజీ నలుగురు, యూరాలజీ విభాగంలో ఇద్దరు చొప్పున మొత్తం 226 మంది పేషెంట్లను ఎంపిక చేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement