ఖోఖో పోటీల్లో బీవీఆర్‌ఎస్‌ జెడ్పీహెచ్‌ పీఈటీ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఖోఖో పోటీల్లో బీవీఆర్‌ఎస్‌ జెడ్పీహెచ్‌ పీఈటీ ప్రతిభ

Mar 27 2026 9:48 AM | Updated on Mar 27 2026 9:48 AM

కలువాయి(సైదాపురం): జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు కాంస్య పతకం సాధించింది. ఇందులో మండలకేంద్రంలోని బీవీఎన్‌ఆర్‌ జెడ్పీ హైస్కూల్‌ ప్లస్‌ వ్యాయామ ఉపాధ్యా యుడు నిడిగుంట రాజా ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున పాల్గొని, తన ప్రతిభన చూపి రాష్ట్రానికి కాంస్య పతకం సాధించడంలో తమ వంతు కృషి చేశా డని బీవీఎన్‌ఆర్‌ జెడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు ఎస్‌డీ అబ్బాస్‌ ఆలీ తెలిపారు. కాంస్య పతకం సాధించిన రాజాను హైస్కూల్‌ ప్లస్‌ అసిస్టెంట్‌ మల్లికార్జున్‌రెడ్డి, స్టాఫ్‌ సెక్రటరీ పెంచల పుల్లయ్య, విద్యా కమిటీ చైర్మన్‌ కలువాయి మహే ష్‌, సహచర ఉపాధ్యాయులు అభినందించారు.

ప్రకృతి వ్యవసాయంపై చర్చాగోష్టి

చంద్రగిరి: ఎస్వీ అగ్రికల్చర్‌ కళాశాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రకృతి వ్యవసాయంపై గురువారం రైతులతో చర్చాగోష్టి నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ సు మతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ రెడ్డిశేఖర్‌, ప్రసాద రావు, జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి షణ్ముగం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్ర వేత్త లు కేవీ నాగమాధురి, ఎస్‌ మురళీకృష్ణ, ఎస్‌. కలీముల్లా, కె. విశ్వనాథ్‌, పి.మహేశ్వరరెడ్డి, టీఎం హేమలత, బి.సంతోష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

బాలికల వసతి గృహాల తనిఖీ

నాయుడుపేట టౌన్‌: పట్టణంలోని లోతువానిగుంట ఎస్సీ బాలికలు 1, 2 వసతి గృహాలను గురువారం ఎస్సీ కమిషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీపతి బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థినులకు అందుతున్న వసతులపై ఆయన ఆరా తీశారు. వసతిగృహంలో బాలికలకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల గదులు, మరుగుదొడ్లు తదితర వాటిని తనిఖీ చేశారు. ఏమైనా సమస్యలున్నాయా? అని విద్యార్థులను ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ బాలికల వసతిగృహంలో వార్డెన్‌లు నిత్యం పర్యవేక్షిస్తూ వారికి ఆరోగ్యకరమైన భోజనాలను అందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement